16 మంది సభ్యులలో 15 మంది అతనికి మద్దతు ఇవ్వడంతో జైషా తదుపరి ఐసీసీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఐసీసీలో చేరితే అతడి స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు నియమిస్తారనే దానిపై స్పష్టత లేదు. అధికారిక నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ కాబట్టి.. జైషా నిర్ణయం తీసుకోవడానికి 96 గంటల కంటే తక్కువ సమయం ఉంది. కాగా.. ఐసీసీ కొత్త చైర్మన్ డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.