నిజామాబాద్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. మెండోరాలో రికార్డ్ స్థాయిలో 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదో రోజు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 10 వేల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు.. కప్పుల వాగు కారణంగా భీంగల్- సిరికొండ మధ్య,…