బుద్ధభవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఎంపీ అనిల్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరుపై ఎంపీ అనిల్ హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు అనిల్ యాదవ్ కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్‌కు అనిల్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారని,…
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని,…
చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా, ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. చెరువుల…
CM Revanth Reddy: పది రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా 'హైడ్రా' పేరు వినిపిస్తోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపతూ ముందుకు సాగతుంది.
Etela Rajender: హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Ponnam Prabhakar: రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ చెరువులను భూములను..
అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన దామరచెరువు చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లో రెండు కళాశాలలు అక్రమంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. ఈ…
CM Revanth Reddy: 'హైడ్రా' హైదరాబాద్ వరకే పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంపీ డీకే.అరుణ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని, రుణమాఫీ ఒక మోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో రైతులను అయోమయానికి గురిచేసి ఇంట్లో ఒకరికే రుణమాఫీ చేస్తామంటూ రేషన్ కార్డు…
Madhavaram Krishna Rao Comments On Hydra Issue: హైడ్రా పని తీరు పై కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెరువుల సంరక్షణకు నాళాల ఆక్రమణలు కూడా తొలగించి, చెరువులను అభివృద్ది చేయాలని., కూకట్‌పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు, 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటిసులు ఇవ్వటం శోచనీయం అంటూ తెలిపారు. చెరువుల ఆక్రమణలు తెలియక., అన్ని అనుమతులున్నాయని ఇళ్ళను…