Hydra Demolitions: హైడ్రా.. ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు హైడ్రామా చేపట్టిన చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. స్వపక్ష, ప్రతిపక్షం తేడా లేకుండా బుల్డోజర్లతో దూసుకుపోతున్నారు. చెరువులకు ఆనుకుని ఉన్న నిర్మాణాల కూల్చివేత. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల కారణంగా ఆక్రమణకు గురైన చెరువులు, కాలువలు, పార్కుల గురించి హైడ్రాకు ప్రతిరోజూ కనీసం 60 నుంచి 70 ఫిర్యాదులు అందుతున్నాయి. వాటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న హైడ్రా.. ఆక్రమణలకు అనుగుణంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
Read also: Wipro Fresher: విప్రో ఉద్యోగులకు భారీ షాక్.. వారి నియామకాలు రద్దు..
కాగా.. రాంనగర్ లోని మల్లెమ్మ గల్లీలోని 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొన్నారు. ఈ స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని GHMC రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. హైడ్రా పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి.
Allu Arjun: బన్నీ మెప్పిస్తాడా..? చిరు, మహేష్, దేవర కొండ ను మించి చేస్తాడా..!