KTR: హైడ్రా పెద్దవాళ్లని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పేద వల్ల బాధ అందరికీ తెలవాలని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం.. పేదవాళ్లు కూలి పని చేసుకుని ఇటుక ఇటుక పేర్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారన్నారు. వాళ్లు పెద్దవాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు చెప్పగలుగుతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్లో హైడ్రావల్ల అనేకమంది రోడ్లమీద పడ్డారు..
HYDRA: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్‌లోని హబీబ్ నగర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై దాడి చేశారు. నాలా పైన నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా.. హబీబ్ నగర్ ప్రాంతంలో ఎన్ఆర్సి గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో ప్రహరీ గోడను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. స్థానికంగా 7 మీటర్ల విస్తీర్ణంలో నాలా ఉందని గుర్తించిన అధికారులు, వాటిపై జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు…
HYDRA: హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రయాణగుట్ట నియోజకవర్గం, బండ్లగూడ మండలం పరిధిలో హైడ్రా విభాగం అక్రమ కబ్జాదారులపై విరుచుకుపడింది. అక్బర్ నగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో 2000 గజాల మేర కబ్జా చేసిన స్థలాన్ని గుర్తించిన హైడ్రా బృందం, అక్కడ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవల కాలంగా చెరువులు, ప్రభుత్వ భూములపై జరిగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీవ్రంగా ఫోకస్ చేస్తోంది. ఈ చర్యలతో కబ్జా రాయుల్లో…
HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…
Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించకుండానే హైదరాబాదు మూసీ నది పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లు, గుడిసెలను హైడ్రా అధికారులు వెంటనే తొలగించేందుకు పూనుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఇండ్లను కూల్చే పనిని చేపట్టాలని, మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో…
అమీన్ పూర్లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ…