హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. నెలరోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేసారు. హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసారు.ఈ రోజునుంచి అనగా అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా హైదరాబాద్ సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైన అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని చాలా స్పష్టంగా వెల్లడించారు. Also Read…