హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. నెలరోజుల పాటు ఈ ఆంక్షలు విధిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేసారు. హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసారు.ఈ రోజునుంచి అనగా అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా హైదరాబాద్ సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఎవరైన అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని చాలా స్పష్టంగా వెల్లడించారు.
Also Read : OTT : ‘సత్యం’ తోడుగా ప్రేక్షకుల మదిని తాకిన ‘సుందరం’
ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఫంక్షన్స్ అంటే సినిమాలకు చెందిన ఈవెంట్స్ కు ఇందులో భాగమై ఉంటాయి కాబట్టి ఆడియో లాంఛ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు కూడా అనుమతి ఇవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పుష్ప – 2 ప్రీ – రిలీజ్ హంగామా కి చిక్కొచ్చి పడేలా ఉంది. ఒకవేళ పర్మిషన్స్ లేకుంటే పుష్ప ఈవెంట్ కు ఛాన్స్ లేనట్టే. కానీ పుష్ప -2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వెరీ స్పెషల్, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు బన్నీ. సో ఇంతటి భారీ హైప్ ఉన్న సినిమా ఈవెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఉన్న ఒకే ఒక ఆప్సన్ ఆంధ్రప్రదేశ్. అక్కడ భారీ ఈవెంట్ నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. అక్కడ ఎటువంటి నిబంధనలు లేవు పర్మిషన్స్ ఎలాగూ సింపుల్ గా వచ్చేస్తాయి. బహుశా మేకర్స్ అదే ప్లానింగ్ చేస్తారేమో చూడాలి..