Cyber Fraud : హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్…
హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు కొందరు వ్యక్తులు. పసిగట్టిన ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని భగ్నం చేశారు. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ను అరెస్టు చేశారు. సిరాజ్ విజయనగరం లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి నగరంలో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి…
హైదరాబాద్ లో రోజుల వ్యవధిలోనే ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల పాత బస్తీలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అందులోని నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. నేడు మీర్ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం నన్ను…
Fire Accident : నగరంలోని మీర్చౌక్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు…
Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.…
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి పాకిస్తాన్ తోక వంకర చేసింది మన సైన్యం.. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నారు.
MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు.
Jupally Krishna Rao: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్స్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండేది.. కానీ ఇప్పుడు ప్రాతినిధ్యం స్థాయి నుంచి పతకాలు అందించే స్థాయికి ఎదిగారని అన్నారు.
Minister Ponnam: హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పనులపై చర్చించాం అని తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.
BRS Party: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు.