జైలులోనే డ్రగ్స్ దందాకు స్కెచ్ వేశారు. యస్.. మీరు విన్నది కరెక్టే. ఇద్దరు నైజీరియన్లు.. ముగ్గురు ఇండియన్స్ కలిసి డ్రగ్స్ దందాకు ప్లాన్ చేశారు. అంతే కాదు..జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ ప్లాన్ అమలు చేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. మళ్లీ అందరినీ కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర.హైదరాబాద్‌లో డ్రగ్స్ పేరు చెబితే అందులో కచ్చితంగా నైజీరియన్స్ పాత్ర ఉంటుంది.
జైలులో ఒక్కటైన బిషప్, రోనాల్డ్ . హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు నైజీరియన్లు పట్టుబడ్డారు. వారిద్దరి పేర్లు బిషప్, రోనాల్డ్. నిజానికి వీరిద్దరూ మెడికల్ వీసా మీద ఒకరు.. చదువుకోవడానికి ఒకరు ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ టు గోవా షటిల్ చేస్తూ డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. కానీ హైదరాబాద్ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ వేర్వేరుగా జైలుకు పంపించారు. కానీ జైలులో ఇద్దరూ ఒక్కటయ్యారు. వారితోపాటు ఇతర నేరాల్లో జైలుకు వచ్చిన వారిని సైతం పోగు చేసుకుని గ్యాంగ్ ఏర్పాటు చేశారు.. .
హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన నేరస్తులకు ఆశ . డ్రగ్స్ అమ్మితే.. భారీగా సంపాదించవచ్చని హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన నేరస్తులకు ఆశ కల్పించారు ఇద్దరు నైజీరియన్లు. అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చే బాధ్యత తమదని.. వాటిని విక్రయించే బాధ్యత మీదని చెప్పారు. జైలులో వేసిన ప్లాన్..బయటకు వచ్చిన తర్వాత అమలు చేశారు. వీళ్లు బయటకు వచ్చిన తర్వాత కొన్ని గ్యాంగులు ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల నుంచి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా వీళ్లు డ్రగ్స్ దందా స్వేచ్ఛగా చేస్తున్నారు…
ఐదుగురు సభ్యులు గల ముఠాపైన ఇప్పటికే 10కి పైగా కేసులు. హైదరాబాద్ చెందిన వీర్లపల్లి లక్ష్మీపతి, బొంబాయి చెందిన రోమీ భరత్ కుమార్, కర్ణాటక చెందిన అబ్దుల్ జాఫర్ ఖాన్ ఈ ముగ్గురు మూడు ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముగ్గురికి ఇద్దరు నైజీరియన్లు బిషప్, రోనాల్డ్ కలిసి డ్రగ్స్ తెచ్చి ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో వీళ్ల దందా బాగా పెరిగిపోయింది. అంతేకాదు ఒక్కొక్కరు దాదాపు 100 మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్‌తో పాటు ఇద్దరు నైజీరియాలను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు సభ్యులు గల ముఠాపైన ఇప్పటికే 10 కి పైగా కేసులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మకాం మారుస్తూ వీఐపీ ఉండే చోట్ల నివసిస్తూ సర్వీస్ అపార్ట్మెంట్లో స్టే చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు… తొలుత లక్ష్మీపతిని పట్టుకున్న పోలీసులు.. అతను ఇచ్చిన సమాచారంతో మిగతా గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఫలితంగా గోవా, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్రలో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలను కూడా పోలీసులు పట్టుకోగలిగారు..