పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు…
తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది.. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు.. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్.. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని ప్రకటించారు.. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్… అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాద యాత్ర…
ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలైంది… మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి.. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.. తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా… దమ్ముంటే రేవంత్‌రెడ్డి.. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఎన్నికలకు వెళ్దామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మంత్రి మల్లారెడ్డి సవాల్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై…
ఇందిరాపార్క్ లో ఉదయం, సాయత్రం సమయాల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అయితే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సామాన్యప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఇందిరా పార్క్‌కు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండటంతో పార్క్ యాజమాన్యం గేటు ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫ్లెక్సీపై…
నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగి వస్తుండటంతో దేశీంగా ధరలు తగ్గుతున్నాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి 44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర తగ్గి రూ.48,220 కి చేరింది.…
జేఈఈ మెయిన్ చివరి విడత(నాలుగు) పరీక్షలు దేశవ్యాప్తంగా గురువారం మొదలుకానున్నాయి. ఈ నెల 26, 27, 31, సెప్టెంబరు 1, 2వ తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి బీటెక్ కోసం పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 7.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత దేనిలో అధిక స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని…
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. తెల్లవారుజాము నుంచే కుండపోత వానమొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీగా వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లో ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్టలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లక్డీకాపూల్, సికింద్రాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ జంక్షన్లలోని రోడ్లపై నీళ్లు చేరాయి. రహదారులపై చేరిన నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గండిపేట్,…
మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజన్లో పసిడికే డిమాండ్ ఎక్కువ. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,350 కి…
ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. దీనిపై తాజాగా సజ్జనార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సైబరాబాద్ ప్రజానీకానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సేవలు సంతృప్తినిచ్చాయి.. సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి,…
తెలంగాణలో మరోసారి సవాల్ పర్వం తెరపైకి వచ్చింది… మంత్రి మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం సైతం కబ్జా చేసిందేనంటూ.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఇక, దీనిపై మంత్రి మల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.. ఆ వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి.. రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి మల్లాడిరెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఏకవచన వ్యాఖ్యలతో విరిచుకుపడ్డ మల్లారెడ్డి.. రాజీనామా చేద్దాం..…