వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్‌ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss…
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్ఆర్తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇక, వైఎస్ఆర్ సన్నిహితుడి, ఆత్మగా పేరున్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు కూడా ఆహ్వానం వెళ్లింది.. గాంధీ భవన్లో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనానికి నాకు ఆహ్వానం అందింది.. నేను…
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.44,300కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160…
రండి.. మాట్లాడుకుందాం..! పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్ మంత్రివర్గంలో ఉన్నవారికి.. YSతో సన్నిహితంగా మెలిగినవారికి పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం అని చెబుతున్నా.. కార్యక్రమం వెనక ఉద్దేశాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 2న ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరస బహిరంగసభలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. ఇదే టైమ్‌లో 12 ఏళ్ల క్రితం దివంగత…
దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్మెంట్పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో…
దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల…
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ శివారులోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. దీంతో.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేవేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. హిమాయత్ సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1763.05 అడుగులకు చేరింది.. ఇక, ఇన్‌ఫ్లో కూడా భారీగానే ఉండడంతో.. గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.. ఇవాళ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మొదట ఒక్కో గేటు ఫీటు వరకు ఎత్తి…
మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజన్లో పసిడికే డిమాండ్ ఎక్కువ. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 44,450 కి…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయింది. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని…