కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. టీకాల కొరతతో కొంతకాలం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేయాల్సి వచ్చినా.. ఇప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటుంది.. ఎందుకంటే వ్యాక్సినేషన్లో రాష్ట్రం పెట్టుకున్న టార్గెట్‌ను రీచ్ అయ్యింది.. ఇప్పటికే 80 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.. అంటే 80 శాతం ప్రజలకు ఫస్ట్ డోస్ వేశారు.. ఇక, సెప్టెంబర్ నెలాఖరునాటికి వందశాతం మందికి ఫస్ట్ డోస్ వేయడమే టార్గెట్‌గా…
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈ రోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 44,550 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160…
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన ఆయన మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాళేజీకి చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బసచేయనున్నారు. సంజయ్ బస కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.…
కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది… మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. మల్లారెడ్డికి కాదు.. సీఎం కేసీఆర్‌కే నా సవాల్.. అసెంబ్లీ రద్దు చేసి రావాలి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించాడు రేవంత్‌రెడ్డి.. ఇక, అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు.. అయితే, తాజాగా రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇస్తూనే.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.. తాను ఎంపీ…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి… శుక్రవారం రోజు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టారు.. రేవంత్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది.. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆయన బామ్మర్ది మద్దుల శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.. ఆయనపై కూడా కబ్జా ఆరోపణలు చేశారు.. ఇక, రేవంత్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు.. నన్ను ఉప సర్పంచ్ అని అన్నావ్… కానీ, నేను సర్పంచ్ గా పనిచేసాను అని తెలుసుకోవాలని సూచించారు.. మల్లారెడ్డికి…
సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇవాళ గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని… కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా, నియమాలు పాటిస్తూ నిర్వహించుకోవాలని తెలిపారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ లో వినాయక చవితి పండుగ జరుగనున్నట్లు వెల్లడించారు. అటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి…
ఎక్కడ రాజీపడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం.. చక్కగా కాపాడుకోవాలి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు…