Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై అగ్నిమాపక శాఖ స్పందించింది. ఈ సందర్భంగా ఫైర్ డీఎఫ్ఓ వెంకన్న మాట్లాడుతూ.. మాకు ఫోన్ కాల్ వచ్చిన ఒకటిన్నర నిమిషంలో సంఘటన స్థలానికి చేరుకున్నాం.. ఫైర్ ఇంజన్లో పూర్తిస్థాయి అధునాతన పరికరాలు ఉన్నాయి.
కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేధు అనుభవం ఎదురైంది. నిజంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత MICU కి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు.…
భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పీజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. చేనేత దగ్గర్నుంచీ వైద్యసేవల వరకూ అన్ని రంగాలనూ అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను స్నేహితులతో కలిసి జరుపుకోవాలని భావించాడు. ఫ్రెండ్స్ తో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. జయంత్ గౌడ్ స్నేహితులతో మద్యం సేవిస్తూ…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ…
విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్ను…
CHAKRASIDDH : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సిద్ధ వైద్యురాలు డా. భువనగిరి సత్య సింధుజ, ఆమె స్థాపించిన చక్రసిద్ధ్ హోలిస్టిక్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. సింగపూర్లో జరిగిన “ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ సమ్మిట్ 2025″లో వీరు ఈ పురస్కారాలను అందుకున్నారు. 36వ తరం సిద్ధ వైద్యురాలుగా, 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది మంది రోగులకు చికిత్స అందించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన…
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉంది.. అందరూ జీవితంలో రాణించేలా చదువుకోండి.. పిలిస్తే పలికేలా నేను ఉంటా.. పని చేస్తా.. యంగ్ ఇండియా నా బ్రాండ్.. నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే అని పేర్కొన్నారు. అలాగే, ప్రజా ప్రభుత్వంలో దళిత బిడ్డలకు పట్టంకట్టాం.. కులం వల్ల ఎవరికీ సమాజంలో గుర్తింపు రాలేని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదో... ఇస్తే తీసుకున్నట్టు కాకుండా.... తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారట ఆమె. తండ్రి కేసీఆర్కు ఆమె రాసిన లేఖ బయటికి లీకవడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ రచ్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.