వివాహం జరిగి 24 గంటలు కాకముందే ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం నాడు వరుడు మృతి చెందగా.. గురువారం నాడు వధువు ప్రాణం కోల్పోయింది. దీంతో పెళ్లి జరిగిన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లో వెళ్తే… హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళికి ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దల…
రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహా ధర్నాకు ముఖ్య అతిథిగా కిసాన్ సంయుక్త మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్‌తో పాటు ఉత్తారాది రైతు సంఘాల నేతలు ఈ మహాధర్నాకు హాజరయ్యారు.ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. భాష వేరు కావొచ్చు రైతులందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రైతుల సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదన్నారు. కేంద్రాన్ని…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కిడ్నీ వాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు 5, హెపటైటిస్ రోగుల కోసం మరో 5 పడకలను కేటాయించాలన్నారు. Read Also: తెలంగాణ…
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లాడు. చెన్నై లో ఉన్న అత్తగారి ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం బెంగళూరు సమీపంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు…
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరుపొందిన మెట్రో రైలు సంస్థ నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోకు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.…
బంగారానికి డిమాండ్ మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 690 తగ్గి రూ. 45,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
యువరత్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతో ఈనెల 27న శనివారం సాయంత్రం అఖండ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించనున్నట్లు…
హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్నీచర్, పూలకుండీలు ధ్వంసం చేసినందుకు 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటూ మంగళవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున…
దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల27 వరకు తేలిక పాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి…
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్లనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేకపోయామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్మీ అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఇవాళ బీజేపీ ధర్నాకు దిగింది. వారు మేయర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్, పెట్టాలని ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై మేయర్ విజయ లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా…