ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణు అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పిలునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, వివిధ విభాగాలకు చెందిన శాఖదిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ…
అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నూతన విద్యాప్రణాళికపై చర్చించనున్నట్టు సునీల్ అంబేకర్ తెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు జనవరి 5 నుంచి 7 వరకు, 2022 భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు…
మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అవినీతి దేశంలో ఎక్కడ లేదని జేపీ నడ్డా చెబుతున్నారు.. మరీ, ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు. Read Also: కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..! ఢిల్లీ నుంచి తెలంగాణకు…
తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి.. కొందరు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.. మరోవైపు నిన్నటి(డిసెంబర్ 4వ తేదీ 2022)తో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. నేటి నుంచి కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభం కానుందని.. నేటి నుంచి ఆరు సంవత్సరాల పాటు కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీలు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది.. Read Also:…
హైదరాబాద్ వేదిక ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగబోతున్నాయి.. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు జరుగుతోంది.. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక, ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ చేరుకున్నారు.. ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో దేశంలో జరుగుతున్న అనేక ఘటనలపై కీలక చర్చ జరగబోతోంది. ఈ సమావేశంలో యాభైకి…
ఒమిక్రాన్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దాంతో వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతటితో 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగిసినట్టు కాదని తెలిపింది.…
రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపుగా రూ.లక్ష నగదును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్…
ఈ మధ్యే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.. వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటం.. బీజేపీ, కాంగ్రెస్లు చేయడం లేదన్న ఆయన.. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదన్నారు.. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు.. మహిళలకు ప్రాధాన్యత షర్మిల…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో పార్టీ పెడుతున్నారా? అంటూ మీడియా చిట్చాట్లో ఎదురైన ప్రశ్నకు స్పందించిన ఆమె.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు.. ఆంధ్రప్రదేశ్లో పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు.. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం.. పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తాం అన్నారు.. ఇక, ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు వైఎస్ షర్మిల.. రైతు…