సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే తెలంగాణను టచ్ చేసింది.. రోజురోజుకీ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతూనేఉంది.. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 62కు చేరింది.. మరో విషయం ఏంటంటే.. ఆ 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నారు.. దీంతో.. వ్యాక్సిన్ తీసుకోనివారిపై ఈ కొత్త వేరియంట్ త్వరగా ఎటాక్ చేస్తున్నట్టు…
హైదరాబాద్‌లో వాహనదారుల్లో చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియవు. దీంతో వాళ్లు ఎలా పడితే అలా వాహనాన్ని నడిపేస్తుంటారు. రోడ్డు బాగుంది కదా అని 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీలో ఎంవీ యాక్ట్ ప్రకారం బైకర్లు గంటలకు 60 కి.మీ. స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి. అయితే గత ఏడాది లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బైకర్ 66 కి.మీ. వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఛలానా విధించారు. దీంతో సదరు వాహనదారుడు…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు కిక్కే న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే…
ఈ మధ్యే రేవంత్‌రెడ్డిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మార్చాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని ఆ లేఖలో ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది.. అయితే, ఇప్పుడు రేవంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి..…
తెలంగాణ వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.. వైఎస్ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ట్వీట్లో పేర్కొన్న ఆమె.. బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు.. మొన్న ఆర్టీసీ చార్జీలు…
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నవేళ స్పైస్ జెట్ భారీ ఆఫర్‌ను ముందుకు తీసుకొచ్చింది. వావ్ వింటర్ సేల్ పేరుతో ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్ -చెన్నై, జమ్మూ-శ్రీనగర్ మధ్య విమాన ప్రయాణం చేసే వారికి కేవలం రూ. 1122 తో టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అన్ని చార్జీలను కలుపుకొని కేవలం రూ. 1122 చెల్లిస్తే సరిపోతుంది. Read: ఢిల్లీలో మరిన్ని ఆంక్షలు……
హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు. రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు. 2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్డీపీ కింద…
సాహిత్య రంగంలో డాక్టర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ చెన్నయ్యలు తల్లి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని బొగ్గులకుంటలో, తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శాంతా వసంతా ట్రస్టు పురస్కారాల ప్రధానోత్సవంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రితో పాటు శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కే ఐ వరప్రసాద్ రెడ్డి.. పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు. శాంతా వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో……
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్మీట్లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డుప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్…
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్బి-పాస్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి కె. తారకరామారావు సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతినిపురోగతిపై మంత్రి కె. తారకరామారావు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా…