భాగ్యనగరంలో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఓముఠా ప్రయత్నాలు చేస్తోంది. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలు ముద్ర తప్పనిసరి. అది ఒకే చేశాకే మిగ కార్యక్రమం అంతా పూర్తవ్వాలి. అయితే ఒకసారి రిజక్ట్ అయిన యువకులు మళ్లీ ప్రవేశానికి అనుమతికి ఆగలేక గల్ఫ్‌కు వెళ్లేందుకు కొత్త తరహా టెక్నిక్ కనుగొన్నారు.
ఆలోచన వారిదో లేక వేరొకరిదో తెలియదు కానీ వేలుముద్ర సర్జరీ చేసుకునేందు ప్లాన్ వేస్తున్నారు. రిజక్ట్ అయినా కూడా అక్కడికి వెల్లేందుకు దొడ్డిదారి వేస్తూ చాలా మంది యువకులు వెళ్లినారని సమచారం. సంవత్సరం పాటు వేలిముద్రలు కనబడకుండా ఉండేవిధంగా కొత్తరకం సర్జరీని కూడా చేసుకున్నారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువకులకు వేలిముద్రల సర్జరీ చేస్తున్న డాక్టర్ తో పాటు కొంతమంది సిబ్బంది అదుపులో తీసుకున్నారు.
Harish Rao: గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తాం