దీపావళి వచ్చేస్తోంది. దసరా తరువాత మళ్లీ దీపావళి వెలుగులతో సందడి వాతావరణం కనిపించేందుకు నగరం సిద్దమవుతోంది. దీపావళి అంటే చాలు టపాసుల మోత మోగాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే వేడుక. పిల్లలందరూ కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకొనే దీపావళి. అయితే ఇక మనకు టపాసులు కావాలంటే టపాసుల దుకాణాలకు వెళ్ళాల్సిందే. కొద్ది ప్రమాదాలను అరికట్టేందుకు దీపావళి సందర్భంగా తాత్కాలిక టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వారికి ఆయా జోనల్ డీసీపీలు తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. దరఖాస్తు దారులు www.tspolice.gov.in, లేదా eservices.tspolice.gov.in ద్వారా ఈ నెల 18వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read also: Jairam Ramesh: కాంగ్రెస్‌కు ‘భారత్ జోడో యాత్ర’ సంజీవని..
* దరఖాస్తు ఫారంతో పాటు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ జారీ చేసిన ఎన్‌వోసీ,
* ప్రభుత్వ స్థలమైతే సంబంధిత అధికారులు ఇచ్చిన అనుమతి పత్రం,
* ప్రైవేట్ స్థలమైతే స్థల యజమానుల నుంచి అనుమతి పత్రం,
*గత ఏడాది జారీ చేసిన పాత లైసెన్స్ కాపీ,
*భవనాల్లో అయితే ప్రత్యేకంగా ఒక్కటే ఏర్పాటు చేస్తే ఇరుగు పొరుగు వారి నుంచి ఎన్‌వోసీ,
*ఏర్పాటు చేసే దుకాణానికి సంబంధించిన సైట్ ప్లాన్ (బ్లూ ప్రింట్ కాపీ)ను కూడా జత చేయాలని సూచించారు.
*వీటితో పాటు మేడ్చల్ జిల్లాలోని కీసర ఎస్‌బీఐలో లైసెన్స్ ఫీజు కోసం రూ. 600 పోలీస్ శాఖ ఖాతాలో చెల్లించాలని సూచించారు.
Flipkart: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్