Hyderabad: ప్రస్తుతం టీమిండియా బిజీ షెడ్యూల్తో క్రికెట్ ఆడుతోంది. ఇటీవల ఆసియా కప్ ఆడిన భారత్ సొంతగడ్డపై ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్, ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వేదిక కానుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.…
అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించిన సీబీఐ న్యాయస్థానం… హైదరాబాద్లో కొత్తపల్లి గీతను అదుపులోకి తీసుకున్న సీబీఐ టీమ్.. బెంగళూరుకు తరలించింది… పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 52 కోట్లు లోన్ తీసుకొని ఎగ్గొట్టినట్టు గీత దంపతులపై అభియోగాలున్నాయి… విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 52 కోట్లు రుణంగా తీసుకున్న కొత్తపల్లి గీత దపంతులు.. తిరిగి చెల్లించని…
Icrisat: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇక్రిశాట్ రైతుల పాలిట ఓ వరంలా మారింది. భారతదేశంలోనే తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) సైంటిస్టులు జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ఎక్స్-రే టెక్నాలజీ (EZRT) పరిశోధకుల సహకారంతో ఎక్స్రే రేడియోగ్రఫీని ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వేరుశనగల నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తామని సైంటిస్టులు తెలియజేశారు. దీంతో రైతులు నాణ్యమైన పల్లీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు.…
MLC Jeevan Reddy: భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. Itir ప్రాజెక్టు కనుమరుగైందని విమర్శించారు. గిరిజన సమాజం తెలంగాణ వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోతుందని అన్నారు. కేంద్రం గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు కల్పిస్తుంటే రాష్ట్రం మాత్రం 6% రిజర్వేషన్లు కల్పిస్తోందని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగడం లేదని అన్నారు. ఉద్యమ నాయకుడే…
Fire Accident: ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ బైకులే కాలిపోవడం విన్నాం.. కానీ తొలిసారిగా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలోనే అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూబీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో రూబీ లాడ్జీపైకి మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్లో కొందరు టూరిస్టులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హోటల్లో చిక్కుకుపోయిన వారిని…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది… తాజా పరిణామాలపై ఫైర్ అయ్యారు ఈటల… నన్ను సభకు రానియొద్దని అయన అనుకున్నట్టునాడు.. కానీ, కేసీఆర్ని సభకు రాకుండా చేసే బాధ్యత నాది అని నేను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు.. కేసీఆర్ ది శంకిని తనం అని మండిపడ్డ ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంకా ఎన్ని రోజులు ఈ మీటర్ల గురించి మాట్లాడుతారని ప్రశ్నించిన ఈటల…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ఆదాయ మార్గంపై దృష్టి సారించింది.. ఇప్పుడు పరిస్థితి కొంత మారినా.. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర.. గందరగోళమైన పరిస్థితి ఉంటుంది.. ఎక్కడికక్కడ ఓపెన్ స్థలాల్లో ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తాయి.. ఇవి ప్రమాదాలకు పొంచి ఉంటాయి.. చివరకు చెత్త కొందరు ప్రజలు అక్కడే పడవేసి వెళ్లిపోతుంటారు.. అయితే, వాటిని ఆదాయ వనరులుగా వినియోగించేకునే ప్లాన్ చేస్తుంది జీహెచ్ఎంసీ.. అంటే.. ప్రజల భద్రతతో పాటు పారిశుధ్యాన్ని పెంపొందిస్తూ.. సిటీ వ్యాప్తంగా…
తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్టుగా.. ఇప్పుడు దాదాపు 115 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేశాయి.. జులై, ఆగస్టుతో పాటు సెప్టెంబర్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. జులై నెలలో కురిసిన వర్షాలకు ఊళ్లకు ఊళ్లే కొన్ని వారాల పాటు వరద ముంపునకు గురికాగా.. పూర్తిస్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్షాలు అందుకున్నాయి.. దీంతో, మళ్లీ వరద ముంపు పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆగస్టులో…