టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది… ఆయన తండ్రి మహమ్మద్ యూసుఫ్ ప్రాణాలు విడిచారు.. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న యూసుఫ్.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.. మహమ్మద్ యూసుఫ్ మరణంలో అజర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా, మహమ్మద్ యూసుఫ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఇక, రేపు బంజారాహిల్స్ లోని మస్జిద్ ఏ బఖీలో జొహర్ ప్రార్థనల తర్వాత నమాజ్ ఎ జనాజా అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు.
Read Also: Nude Video Call: యువకుడికి న్యూడ్ కాల్ వేధింపులు.. పల్లెలను కూడా వదలడంలేదుగా..!