Hyderabad Night Traffic: హైదరాబాద్ సిటీలో రాత్రి ట్రాఫిక్ రూల్స్ వర్తించవా.? సిగ్నల్ పడ్డా కూడా డోంట్ కేర్ అంటూ వెళ్లొచ్చా.? ట్రాఫిక్ నియంత్రణ, రూల్స్ అన్ని పగలు మాత్రమేనా.? నగరంలో రాత్రిల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు లెక్కే లేదు.. ఇష్ఠానుసారంగా వ్యవహరిస్తున్న వాహనదారుల చర్యలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. మరీ.. పగటి పూట ప్రమాదాలను నివారించడానికి చర్యలు ఓకే.. మరి రాత్రి సంగతేంటి.?
హైదరాబాద్ సిటీలో డే అండ్ నైట్ భారీగా వెహికిల్స్ తిరుగుతుంటాయి. డే లో అయితే ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ కష్టాలు ఒకటైతే ట్రాఫిక్ రూల్స్ వాయలేషన్ మరొకటి. ప్రధానంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాకుండా ఇష్ఠానుసారంగా డ్రైవింగ్ చేస్తు ప్రమాదాలకు గురైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇంకా రోజువారీగా జరుగుతూనే ఉన్నాయి కూడా. ఇదిలావుండగా ముఖ్యంగా రాత్రుల్లో ప్రమాదాలకు గురవుతున్న వారిలో బైక్, కార్ల ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. మరి వీరే ఎందుకు అంటారా.? రాత్రిపూట అయితే ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు.. అదీకాకుండా సిగ్నల్ దగ్గర ఆగాల్సిన పని ఉండదు.. రాంగ్ సైడ్ లో వెళ్లినా పట్టించుకునే వారుండరు.. ఇక స్పీడ్ అయితే నో లిమిట్.. ఇవే ప్రమాదాలకు దారితీసి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
వాయలేషన్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ..
నగరంలో ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, పంజాగుట్ట వంటి ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. పగటి పూట ఉండే ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ని నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉంటారు. కేవలం ట్రాఫిక్ నియంత్రణే కాకుండా.. ట్రాఫిక్ రూల్స్ వాయలేషన్ చేసే వారిపైనే కూడా ఓ కన్నేసి చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాస్ తో కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను గుర్తించి చలాన్స్ వంటివి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి వాటిపైనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ ఫైన్స్.. పరిధి దాటితే.. శిక్ష వంటివి అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ ని నియంత్రించడానికి, సేఫ్ డ్రైవింగ్ కోసం పోలీసులు రూల్స్ ని కాస్త స్ట్రిక్ట్ చేసారు. జీబ్రా లైన్ బ్లాక్, వైట్ లైన్ క్రాస్, సిగ్నల్ జంపింగ్, త్రిబుల్ రైడింగ్, విత్ ఔట్ హెల్మెట్ డ్రైవింగ్, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్.. ఇలా వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ డే టైం లో ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి.. వాహనదారులకు ఇబ్బందులకు గురికాకుండా ఉండటంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు యూజ్ అవుతుంది. మరి రాత్రిల్లో ఇవన్నీ క్లియర్ కట్ గా అమలు అవుతున్నాయా అంటే లేదు అనే చెప్పుకోవాలి.
Read Also: Rats Bite Notes: నోట్లు కొరికేసిన ఎలుకలు…లబోదిబోమంటున్న బాధితుడు
హైటెక్ బాబులకు హద్దులు ఉండవు
నగరంలో రాత్రుల్లో కూడా భారీగానే వాహనాలు తిరుగుతుంటాయి. రాత్రుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించే వారు చాలా తక్కువ మంది. వెహికిల్ స్పీడ్ కిలో లిమిట్.. నో రాంగ్ సైడ్.. ఎట్లా అంటే అట్లా బండి నడపడమే.. నైట్ చూసే వారుంటారా ఏంటి.? ఒక్క బండి మీద త్రిబుల్ కాదు అవసరమైతే నలుగురిని కూడా ఎక్కించుకోవచ్చు. నో హెల్మెట్.. ఓన్లీ రైడింగ్ ఇదే రాత్రిల్లో చాలా మంది ఆలోచన. కేవలం బైక్ నడిపేవారే కాదు కార్స్ కి అయితే ఎంత స్పీడ్లో ఉన్నామో తెలియకుండా గాల్లోకి గెరిపోదామేమో అన్నట్టు నడుపుతున్నారు. అదీకాకుండా మందు తాగి వెహికిల్స్ నడుపుతున్నారు. మద్యం మత్తులో సిగ్నల్ పడిందా డోంట్ కేర్ అనుకుంటూ తమ ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు తీస్తున్న వారెందరో ఉన్నారు. ఇక ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదాపూర్, హై టెక్ సిటీ ఏరియాల్లో తిరుగుతుంటాయి. రెస్టారెంట్స్ బార్స్ పబ్స్ అంటూ ఈ ఏరియాస్ కి వస్తుంటారు. అదీకాకుండా ఇక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్న పోలీసు చెకింగ్ కేవలం వీకెండ్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. దాంతో విచ్చలవిడిగా తాగడం తాగి నడపడం.
Read Also: Maharashtra: చంద్రపూర్ జిల్లాలో పులి బీభత్సం.. ఇద్దరు పశువుల కాపర్లపై దాడి.
నియంత్రణ చర్యలు ఏవీ ?
మరి రాత్రిళ్లలో ఇంత ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్న చర్యలు ఎందుకు లేవు.? రూల్స్ పాటించాల్సింది పగలేనా.? రాత్రి నడపడానికి రూల్స్ అవసరం లేదు అనుకుంటున్నారు జనాలు. విచ్చలవిడిగా ఎవ్వరికి తోచినట్టు వారు డ్రైవింగ్ చేస్తున్నారు. అయితే అందరూ వాహనదారులు రూల్స్ పాటించడం లేదా అంటే కాదు.. కొద్దీ మంది మాత్రమే నైట్ కూడా రూల్స్ ఫాలో అవుతున్నారు. నైట్ లో పోలీసులు పర్యవేక్షణ లేకపోవడంతో పాటు చలానాలు పడకపోవడమే వాహనదారుల నిర్లక్ష్యానికి ప్రధాన కారణం. ఇక సిగ్నల్ దగ్గర ఆగాలంటే ఖచ్చితంగా అక్కడే ట్రాఫిక్ సిబ్బంది ఉంటేనే ఆగుతాం అంటూ వ్యవహరిస్తున్నారు. మొత్తంగా మాకు మేము ట్రాఫిక్ రూల్స్ ని పాటించం అన్నట్టుగా వ్యవరిస్తున్నారు వాహనదారులు. ఇక పగలు మాత్రమే కాదు రాత్రి సమయాల్లో కూడా పోలీసుల నిఘా అవసరమే.