Telugu Serial Actress Arresst: వెండితెర కంటే బుల్లితెర నటీనటులకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో పలు సీరియళ్లలో నటిస్తున్న తమ అభిమాన నటి పోలీసుల అదుపులో ఉందనే వార్త ఇప్పుడు ప్రేక్షకుల్లో కలకలం రేపుతోంది. గుండమ్మ కథ, గుప్పెడంత మనసు వంటి సీరియళ్లలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నాగవర్ధిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెను హత్యాయత్నం కేసులో అదుపులోకి తీుసుకున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పలువురు చెబుతున్నారు. అతడిని భవనం పైనుంచి తోసేశారని ఆరోపణలు వస్తున్నాయి. అతని మిత్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాగవర్దిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. నాగవర్దిని గుండమ్మ కథ, గుప్పెడంత మనసు సీరియళ్లలో ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆమె రెండో ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్యను భవనం పైనుంచి తోసేసినట్లు సూర్య మిత్రులు ఆరోపిస్తున్నారు. సూర్య మిత్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నాగవర్దిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.