Physical harassment: ములాకత్‌కు వచ్చే ఖైదీల భార్యలే టార్గెట్..! చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌పై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలు ఎక్కడున్నా.. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడంలేదు.. పసికూనల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, తాజాగా, చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు వేసింది జైళ్ల శాఖ.. జైలులో ఉన్నవారిని కలిసేందుకు, చూసేందుకు సాధారణంగా ములాకత్‌కు వస్తుంటారు.. ఖైదీల కుటుంబ సభ్యులు.. అయితే, ములాకత్‌కు వచ్చే ఖైదీల భార్యలను వేధిస్తున్నాడని దశరథంపై ఆరోపణలు వచ్చాయి.. దీంతో, జైళ్ల శాఖ డీజీ జితేందర్ చర్యలు తీసుకున్నారు.
Read Also: Botsa Satyanarayana: పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయిన మంత్రి బొత్స..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం డీజీ వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన ఆయన… పరిపాలనకు భంగం కలిగిస్తున్నాడనే ఆరోపణలపై డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు ఆదేశించారు.. ఆయనను చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. కాగా, దశరథంపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదంటున్నారు అధికారులు.. గతంలో జైలులో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని కూడా లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి.. దశరథంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. మళ్లీ ఆరోపణలు రావడంతో ఈ సారి చర్యలకు దిగింది జైళ్ల శాఖ.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి