MNJ Hospital: క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరమవకుండా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
MP YS Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది.. ఈ రోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆయన హైదరాబాద్‌కు రావడంతో.. ఈ రోజు సీబీఐ ముందుకు వస్తారని భావించారు.. ఉదయం 11 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టారు.. ఈ రోజు విచారణకు రాలేను…
Bhopal HUT Case: భూపాల్ హట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బిర్యానీ, లడ్డు అనే పదాలు కోడ్ లాంగ్వేజ్ లుగా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిపినట్లు తెలిపారు.
SRH vs RCB: ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 187 పరుగుల లక్ష్యఛేదనలో ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా వీర బాదుడు బాదాడు కోహ్లీ. 63 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి, సన్‌రైజర్స్ ఆటగాడు భువీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన గేల్ రికార్డును సమం చేశాడు…
ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు…
Medtronic’s: తెలంగాణకు విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
AP Crime: ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రాధ.. ఇటీవలే తన సొంత గ్రామానికి వెళ్లింది.. అయితే, నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది.. దీంతో.. తెలిసినవారి ఇల్లు, బంధువుల ఇళ్లలో వెతికిన కుటుంబసభ్యులు.. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించారు.. తమ కూతురు…
Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను నిషేధించబోతున్నారు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో…
Telangana Secretariat: సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్ పాస్‌లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ పాస్ తీసుకొని సచివాలయంలోకి వెళ్ళిన తరువాత గతంలో మాదిరిగా తనకు అవసరం ఉన్న ఇతర శాఖల అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకుంటే.. ఇకపై కుదరదు. సచివాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ శాఖ అధికారులను కలవాలో ముందుగా…
hyderabad Crime: హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.. తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయ్యింది.. ఓ నల్ల కవర్లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు.. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే,…