Amit Sha Tour: నేడే హైదరాబాద్ కు అమిత్ షా.. దర్శక ధీరుడు రాజమౌళితో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Sha Tour: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు. అయితే అయిత్ షా పర్యటనలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి నివాసానికి వెళ్లనున్నారు. అలాగే హీరో ప్రభాస్ తో కూడా అమిత్ షా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉన్నాయి. రాజమౌళి నివాసంలో 11.45 నుంచి 12.15 వరకు ఉండనున్నారు. 12.45 నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం భద్రాచలంకు వెళ్లనున్నారు. ఉదయం 4 గంటల నుంచి 4.40 వరకు శ్రీరాముల వారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుండి ఖమ్మంకి వెళ్లనున్నారు అమిత్ షా. సాయంత్రం 5.40- 5.55 వరకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 6-7 గంటల వరకు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. 7.10 నుంచి 7.40 వరకు ఖమ్మం గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7.40కి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లి.. అక్కడ నుంచి గుజరాత్ వెళ్లనున్నారు అమిత్ షా.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
రేపు (15)న ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనాల్సిన అమిత్ షా.. ఒక్కరోజు ముందే వస్తున్నారు. తన పర్యటనలో పలువురు ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, మీడియా, క్రీడా రంగాల సెలబ్రిటీలతో పలు అంశాలపై షా చర్చించనున్నట్లు పేర్కొంటున్నాయి. ఇంతకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశారు. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్ తదితరులను కలిసిన విషయం తెలిసిందే. మరి ఈసారి పర్యటనలో రాజమౌళి, ప్రభాస్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తుండగా.. మరికొందరిని కలుస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో అమిత్ షా ఎవరెవరిని కలుస్తారో అన్న అంశం ఆసక్తిగా మారింది.
Wednesday Stotra: ఈ స్తోత్రాలు వింటే ఆర్థిక ఇబ్బందులు, శారీరక, మానసికలు దూరమవుతాయి
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!