హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు అనారోగ్యంతో పాటు మధ్యంతర బెయిల్ పై పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇక, చంద్రబాబు- పవన్ మధ్య భేటీ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చే ఛాన్స్.. సీఐడీ పెడుతోన్న వరుస కేసుల పైనా కూడా ఇరువురు చర్చించే అవకాశం.. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల లీడర్లు, కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైనా చర్చ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!
ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చంద్రబాబు-పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. పది అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని టీడీపీ- జనసేన పార్టీలు భావిస్తున్నాయి. కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పన మీద చర్చించే అవకాశం ఉంది. కరువు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభ కోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని టీడీపీ- జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార వైపీసీ పార్టీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తు్న్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇరు పార్టీలు చూస్తున్నాయి.