అధికారులు ఎన్ని కట్టుదిట్టమై చర్యలు తీసుకున్న బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న కేటుగాళ్లని చాకచక్యంగా పట్టుకుంటున్నారు అధికారులు.
తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై వివాదం కొనసాగుతునే ఉంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ వేసింది.
హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఏనుగు కేర్ టేకర్ పై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. నేటి (శనివారం) సాయంత్రం ఏనుగుల సఫారీలో విధుల్లో ఉన్న షాబాజ్ అనే మావటిపై ఓ ఏనుగు సడెన్ గా దాడి చేసింది.
సైబర్ నేరాలు గుర్తించడం, నేరగాళ్లు విచారణ, దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేయడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశ్యం అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబర్ క్రైమ్ సెక్యురిటి కోసమే, డిజిటల్ సెక్యూర్ కోసమే ఈ కౌన్సిల్.. సైబర్ త్రెట్నింగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖ అలెర్ట్ గా ఉంది.. తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫైనల్ కీని విడుదల చేసింది. గ్రూప్-4 తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 పరీక్షలో పేపర్ 1లో 7 ప్రశ్నలను అధికారులు తొలగించారు. మరో 8 ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు..
తెలంగాణ రాష్ట్రానికి మరో సంస్థ రావడానికి రెడీ అయింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్టెక్ కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ( ఎక్స్ ) అకౌంట్లో పోస్టు చేశారు.
పదేళ్ళ తెలంగాణ వ్యవసాయ ప్రగతి నివేదికను మంత్రి నిరంజన్ రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఆవిష్కరించారు. పంటల సాగు విస్తీర్ణం: 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా, 2022-23 నాటికి అది 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.