మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల టైంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఫెస్ వ్యాల్యూ లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు.. కేసీఆర్ పులి అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం రెడీ అయింది. కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ప్రచార రథం సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం తప్పింది. కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ వద్దకు రాగానే గమనించిన డ్రైవర్ చాకచక్యంగా.. ఎవరికి హాని కలగకుండా పార్క్ వైపు ఉన్న ఫుట్పాత్ పై బస్సును ఆపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన ఇద్దరు దూరదృష్టి గల హైస్కూల్ విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీష్ రెడ్డిలు మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ను రూపొందించారు. దానిని హైదరాబాద్లో చే శక్తి వంతమైన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ) సివిటాస్ మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది.
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని కేసీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
HCA Announce Hyderabad Cricket Team for Syed Mushtaq Ali Trophy: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ బంపరాఫర్ కొట్టేశాడు. ఏకంగా కెప్టెన్గా ప్రమోషన్ పొందాడు. దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తిలక్ ముందుండి నడిపించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తాజాగా హెచ్సీఏ అధికారులు ప్రకటించింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా తిలక్ వర్మను ప్రకటించారు.…
తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.
హైదరాబాద్లోని మాదాపూర్లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మాదాపూర్లోని గోల్డెన్ హైవ్ ఓయో లాడ్జిలో ప్రియ ( 25) అనే యువతి అనుమానాస్పద స్థితి మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కేవలం తెలంగాణాలో మాత్రమే కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.