IT Raids: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి సబితా బంధువుల ఇంటిపై దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఓటింగ్‌కు 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇంటి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. మై హోం శాఖలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలకు ఫార్మా కంపెనీలు నిధులు ఇస్తారనే అంచనాతో ఈ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. వారం రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్, మాజీ మంత్రి జానా రెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ దాడులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పరస్పరం కుమ్మక్కయ్యాయని, తమ పార్టీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు గ్రూపుల వారీగా ఐటీ దాడులు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్‌ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
TDP-Janasena Manifesto Committee: నేడు టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?