Telangana Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు.
కొంపెళ్ళ మాధవీలత.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఆమె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో... పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారామె. అంతేకాదు.. పార్టీ పరంగా.. లోకల్‌తో సంబంధం లేకుండా ఢిల్లీ లింక్స్‌తో బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ టికెట్ తెచ్చుకున్న మహిళ నేత. ఆ ఊపుతోనే హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఓల్డ్‌సిటీ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు.
గరుడ ప్రసాదం పంపిణీపై స్పందించారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. చిలుకూరు దేవస్థానంలో పంపిణీ చేయాల్సిన గరుడ ప్రసాదం పంపిణీని నిలిపిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారీగా భక్తులు వస్తుండటంతో ఇవాళ్టితో ప్రసాదం పంపిణీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్- హాల్ సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు – 6 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 3 అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 3 అర్హతలు.. గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.…
ఐపీఎల్ టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) బోర్డ్ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్రలు డిమాండ్ చేశారు.