Children Sales: హైదరాబాద్ శివారులో పిల్లల అమ్మకాల గుట్టురట్టు చేశారు. రాచకొండ పోలీసులు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారులను రాచకొండ పోలీసులు రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ముఠా అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా.. ఫిర్జాదిగూడలో ఆర్‌ఎంపీ శోభారాణితో సహా 11మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక.. పిర్జాదిగూడ రామకృష్ణ నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read also: Ayodhya: అయోధ్య శ్రీ రామయ్యకు దుబ్బాక చేనేత వస్త్రం..
అయితే.. 16 మంది చిన్నారుల ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు. కాగా.. మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్‌లో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. పోషించడం భారమంటూ తల్లులకు చెప్పడమేకాకుడా.. మానవత్వతో పిల్లలు లేనివారికి ఇస్తామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే పిల్లల విక్రయాలు 50 మందితో జరిపారా లేక ఇంకా ఏమైనా గుట్టు దాచారా అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telangana State Symbol: జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల..