Nehru Zoological Park: సరికొత్త రికార్డ్.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nehru Zoological Park: హైదరాబాద్ జూపార్క్ కు సందర్శకులు పెద్ద సంఖ్యలో రావడంతో కిటకిట లాడింది. కూల్ వెదర్.. అందులోనూ వీకెండ్.. ఇంకేముందు బెస్ట్ హాలీడే స్పాట్‌గా నెహ్రూ జూలాజికల్ పార్క్ ఫస్ట్ ప్లేస్‌కి వచ్చేసింది. ఇక.. ఇప్పుడు వెదర్ మారిపోవడంతో బయటకొచ్చి చిల్ అవుతున్నారు… ఆదివారం సెలవు దినం కావడంతో బెస్ట్ హాలీడే స్పాట్‌ను ఫిక్స్ చేసుకుంటున్నారు. కాగా.. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్కు రద్దీ పెరిగింది. అందరూ.. ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సమేతంగా జూకు క్యూ కడుతున్నారు. ఇక.. పిల్లలతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. కాగా.. మరికొందరైతే చెట్ల కిందే కార్పెట్లు వేసుకొని మధ్యాహ్నం అక్కడే ఓ కునుకు తీస్తున్నారు. ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మునుపెన్నడూ లేని విధంగా రష్ నెహ్రూ జూపార్క్‌లో కనిపిస్తోంది. ఇక.. ఎంట్రీ టికెట్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితొచ్చింది.
Read also: Chhattisgarh : పేలుడు జరిగి 36 గంటలు గడిచినా.. లభించని ఎనిమిది మంది కూలీల ఆచూకీ
Also Read
- Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
- GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
కాగా.. సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 8 వేల మందికిపైగా వచ్చే నెహ్రూ జూపార్క్‌కు ఆదివారం ఒక్కరోజే 30వేల మంది రావడం సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక్కడ.. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా.. విదేశీలు సంఖ్య గట్టిగానే ఉంది. ఇక్కడ.. ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్‌డే ఫోటో షూట్స్ కోసం కూడా జూ పార్క్‌నే ప్రధాన స్పాట్లుగా ఎంచుకోవడం కూడా భారీ రద్దీకి కారణంగా కనిపిస్తోంది. దీంతో.. సందర్శకుల రద్దీ దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది సిబ్బంది. పార్క్ కు సందర్శకుల తాకిడి గట్టిగా ఉండటంతో టికెట్ కౌంటర్ల సంఖ్య పెంచారు. దీంతో.. కౌంటర్ల దగ్గర ఎండ తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. మంచినీళ్లను సైతం అందిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా.. ఇలాంటి రద్దీని మునుపెన్నడూ చూడలేదంటున్నారు జూ పార్క్ సిబ్బంది. అయితే.. ఈ వారం రోజుల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌పార్టీ.. నేడు 86 మందిని విచారించనున్న పోలీసులు!
తాజావార్తలు
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
-
Nagpur MLC Election Result: నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం! ఎవరీ అభిజీత్ వంజారీ?
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
-
Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!