Mailardevpally Wall Collapse: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్ రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీఆర్ఆర్ టీం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి సీఐ మధు సహా చిన్నారుల తల్లిదండ్రులు స్పందించారు. ఎన్టీవీతో డీఆర్ఆర్…
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. తీహార్ జైలు అధికారులు నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్నారు.
Missing: విదేశాల్లో చదువుకుంటున్న భారతీయలు ఇటీవల కాలంలో విపరీత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో చనిపోవడం, ఇతర కారణాల వల్ల దాడులకు గురికావడం, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల్ని, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
FNCC సభ్యులు, కుటుంబ సభ్యులు, అతిధులు అధిక సంఖ్యలో మహిళలు ఈ బంపర్ తంబోలాలో పాల్గొన్నారు. ఈ బంపర్ తంబోలాలో గెలిచినా వారికి 5 రౌండ్స్ ఐదు కార్లు ఆల్టో, సెలెరియో, టాటా టియాగో, టొయోట గ్లాంజా, బంపర్ ప్రైజ్ మెర్స్డ్స్ బెంజ్ ఎ క్లాస్ లను అందజేశారు. బెంజ్ గెలిచిన విన్నర్స్ సత్నం కౌర్, డి. సాయికిరణ్. బంపర్ తంబోలా విన్నర్స్ కు FNCC సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగ రావు,…
ఒకవైపు ఎండల వేడి కారణంగా చల్లబడడానికి మందుబాబులు భారీగా వైన్ షాపుల ముందు వేచి చూస్తుండగా.. వరుస బంద్ లతో వాటిని మూసేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వారికి గట్టి షాక్ తగిలింది. గత నెల రోజుల నుండి పలు కారణాలతో మద్యం దుకాణాలు మూసివేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా జూన్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కారణంగా మరోసారి మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని లోక్‌సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు…
Power Cuts: మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ బానోతు చరణ్‌సింగ్ తెలిపారు.
చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్ 7, 8వ తేదీల్లో తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.