Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌కు పోటెత్తిన వరద.. ఇక గేట్లు ఎత్తుడే మిగిలింది..!
- శ్రీశైలం డ్యామ్ క్రమంగా వరద పోటెత్తుతోంది..
- ఓవైపు కృష్ణా రివర్.. మరోవైపు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద..
- శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున పెరుగుతోన్న నీటిమట్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: శ్రీశైలం డ్యామ్ క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఓవైపు కృష్ణా రివర్.. మరోవైపు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది.. తుంగభద్ర జలాశయంలో 28 గేట్ల ద్వారా లక్ష 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇక, సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.. ఇక, తుంగభద్ర నుంచి నీటి విడుదల లక్షా 50 వేలకు పెంచే అవకాశం కూడా ఉంది.. జూరాల నుంచి ఇప్పటికే 2 లక్షల 51 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.. ఇలా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది..
Read Also: Hero Vishal: సినిమాలు చేస్తూనే ఉంటా.. దమ్ముంటే ఆపుకోండి! ఫిల్మ్ చాంబర్‌కి విశాల్ సవాల్
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు.. రాబోయే 15 రోజుల్లో కృష్ణ బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 864.4 అడుగులకు చేరుకుంది.. నీటినిలువ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 118.5 టీఎంసీలుగా ఉంది.. ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. సోమ లేదా మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అంటూ ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.. గేట్లు ఎత్తే సమయంలో.. పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పర్యాటకులు పోటెత్తే విషయం విదితమే.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!