తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
OTS Scheme: నేటితో జలమండలి ఓటీఎస్ ఆఫర్ ముగియనుంది. పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లులు చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని జలమండలి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికయ్యింది.
చరిత్ర చదవకుండా భవిష్యత్‌ను నిర్మించలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతామన్నారు.
హైపర్ మార్ట్ వాల్యూజోన్.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హైపర్ మార్ట్స్తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు (నవంబర్ 28)న ప్రారంభించారు.
Hyderabad: హైదరాబాద్‌లోని ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్‌స్టాప్ దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు..
తోటి మనుషులను ప్రేమించాలని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావాలి.. సంఘంతో జీవించాలి అన్న క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ, పేదలకు చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు.
35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో తిరుగుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు సోమవారం (నవంబర్ 26) ఎట్టకేలకు ఈ సీరియస్ కిల్లర్ ను పట్టుకున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్‌రాజ్ సింగ్ వాఘేలాను నిందితుడి యొక్క వివరాలను తెలిపాడు.
Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
Fancy Numbers Demand : ప్రతిరోజూ మార్కెట్లోకి విభిన్న ఫీచర్లతో ఉన్న వాహనాలు ప్రవేశిస్తున్నాయి. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన వాహనం ప్రత్యేకంగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ప్రత్యేకంగా తీసుకోవాలని భావిస్తారు. ఖర్చు ఎంతైనా సరే, ఇష్టమైన వాహనానికి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడంలో వెనుకాడరు. ఇందుకోసం వేలంపాటలో పాల్గొని ప్రత్యేక నంబర్లు పొందుతారు. ఈ ఉత్సాహం…