Komatireddy Venkat Reddy: ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..
- కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం- మంత్రి
- సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. ఈ క్రమంలో.. తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని అభిప్రాయపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. అందుకోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచింది. 27-12-2024 నుంచే టెండర్లు అందుబాటులోకి వచ్చాయి. టెండర్ల దాఖలుకు చివరి తేదీ 14-02-2025 (11.30 గంటల). 14-02-2025 తేదీన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు తెరవనుంది. ఆర్ఆర్ఆర్ కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2017లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించినా.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు వెనకబడ్డాయన్నారు. 2023 డిసెంబర్‌లో పదవి చేపట్టిన నాటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు కోసం నిరంతరం కృషి చేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భూసేకరణపై అనేక సార్లు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ గేమ్ ఛేంజర్ అయితే, ఆర్ఆర్ఆర్ సూపర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్ కీలక భూమిక పోషించబోతుందని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి చేసిన కృషి ఫలించిందన్నారు. తెలంగాణలో గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్డు పనులు ఆలస్యం అయ్యాయని ఆరోపించారు. అప్పుడే యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని లేఖ ఇచ్చుంటే ఈ పాటికి రీజినల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తాను స్వయంగా ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి యుటిలిటీ ఛార్జీల చెల్లిస్తామని లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద మనసు చేసుకొని యుటిలిటీ ఛార్జీలు కూడా కేంద్రమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.
Pawankalyan OG: పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక ప్రకటన..
టెండర్ వివరాలు
1వ ప్యాకేజీ:
గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1529.19 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
2వ ప్యాకేజీ:
రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1114.80 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
3వ ప్యాకేజీ:
ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1184.81 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
4వ ప్యాకేజీ:
ప్రజ్ఞపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి– 1728.22 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం. 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
5వ ప్యాకేజీ:
రాయగిరి గ్రామం నుంచి తంగడ్ పల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు.. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని– 1547.04 కోట్లతో రెండు సంవత్సరాల నిర్మాణ సమయం, 5 సంవత్సరాల మొయింటెనెన్స్.
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!