Heavy Rain: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
Rain Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.…
Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ వాయు చక్రవాత ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, నేటి , రేపు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో…
తెలంగాణలో వాతావరణం తేలియాడుతోంది. ఎప్పుడు ఎండలు పీక్ స్టేజ్‌లో ఉంటాయో, ఎప్పుడు ఆకస్మికంగా వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరిస్తున్నారు.
Weather Updates: తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశముందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,…
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. కాగా.. సోమవారం (మార్చి 31) ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి…
Hyderabad Rain : హైదరాబాద్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఈ మార్పుతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షపు జల్లు కురిసింది. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ తాజా ప్రకటన…
Weather Warning: వేసవి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు భగభగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
Telangana Temperatures: తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు.