కార్ల అద్దాలకు అమర్చే బ్లాక్ స్టిక్కర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్ ఏరియాలో బ్లాక్ స్టిక్కర్స్ వేసుకొని వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లతో పాటు బ్లాక్ గ్లాస్‌లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్ స్టిక్కర్లను పోలీసులు తొలగిస్తున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్…