Hyderabad Traffic: ఫుట్ పాత్‌ల మీద విక్రయాలు జరుపుతున్నారా? అలా ఆక్రమించుకుంటే కఠిచర్యలు తప్పవంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. వీరిపై కేసులు బుక్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఫుట్ పాత్ ను ఆక్రమించుకుంటే ఇకమీదట కఠిన చర్యలే అంటున్నారు. ప్రధాన రోడ్ల తో పాటు స్లీప్ రోడ్డు మీద ఫుట్ పాత్ కబ్జా చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. కమర్షియల్ ఏరియాలో ఫుట్ పాత్ మీద వస్తువులను డిస్ ప్లే చేయడం నిషిద్ధం. పాదాచార్లకు వాహనదారులకు…
Hyderabad Traffic Police Warning: హైదరాబాద్ నగరంలో చలాన్లు పడకుండా కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్ కనబడకుండా చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ తీసేయడం, మాస్కు కట్టడం, ప్రింట్ తుడిచేయడం లాంటివి చేస్తున్నారు. కొందరు నేరస్తులు నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. వాహనాల నంబర్ ప్లేట్‌లు టాంపిరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనానికి…
రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయం మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ…
తెలంగాణలో తమ వాహనాలపై పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగియవచ్చింది.. ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్‌కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న చలాన్‌లకు ఇచ్చిన డిస్కౌంట్ క్లియర్ చేసే సమయం 15-4-2022 సాయంత్రంతో ముగుస్తుంది. ఇకపై…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కాఠిన్యం మరోసారి బయటపడింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా వారిని ఆపి జరిమానా విధిస్తూ తమ్ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచు ట్రాఫిక్ పోలీసులు టింటెడ్ గ్లాస్ నిబంధనను ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా పెట్టిన విషయం తెలిసిందే.. ఇందులో ఎక్కువ సెలబ్రిటీలు ఉండడం విశేషం. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్లను అడ్డుకొని కార్లకు ఉన్న బ్లాక్ఫిల్మ్ ను తొలగించి,…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. గత వారం రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫిల్మ్‌లు ఉన్న కార్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఆయన కారును ఆపి తనిఖీలు చేసిన పోలీసులు, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వుండడంతో వాటిని తొలగించి…
మరో టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. సమాచారం ప్రకారం టోలిచౌకి వద్ద తాజాగా నటుడు మంచు మనోజ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి, అతని కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తీసివేశారు. అలాగే బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారును ఉపయోగిస్తున్నందుకు మనోజ్ కు రూ. 700 జరిమానా విధించారు. టింటెడ్…
Allu Arjun and Kalyan Ramలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ కారును ఆపి, ఆ కారుకు నల్ల ఫిల్మ్ లు ఉండడంతో వాటిని తొలగించడంతో పాటు 700 రూపాయల జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ఇక అదే దారిలో వెళుతున్న మరో హీరో కళ్యాణ్ రామ్…
కార్ల అద్దాలకు అమర్చే బ్లాక్ స్టిక్కర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్ ఏరియాలో బ్లాక్ స్టిక్కర్స్ వేసుకొని వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లతో పాటు బ్లాక్ గ్లాస్‌లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్ స్టిక్కర్లను పోలీసులు తొలగిస్తున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.…