టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. గత వారం రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫిల్మ్‌లు ఉన్న కార్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఆయన కారును ఆపి తనిఖీలు చేసిన పోలీసులు, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వుండడంతో వాటిని తొలగించి జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్, నందమూరి కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ వంటి హీరోల కార్లకు కూడా ఇలాగే జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ ఫిల్మ్ ల కారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన సెలెబ్రిటీల జాబితాలో త్రివిక్రమ్ కూడా చేరిపోయారు.
Read Also : Puri Jagannadh and Charmme : బాలీవుడ్ స్టార్ సెట్లో సందడి
కార్లకు టింటెడ్ గ్లాసెస్‌పై బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బ్లాక్ ఫిల్మ్ తో కార్లలో రోడ్లపై తిరుగుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎక్కువగా తనిఖీలు చేస్తున్నారు.