Home
Hyderabad Rains
Hyderabad Rains News
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. శనివారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం ఉదయం నుంచే బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. ఇక రాబోయే కొన్ని గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు పరిసరాల్లో మొదలైన ఉరుముల వానలు జయశంకర్ భూపాలపల్లి,… -
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
తెలంగాణలో రాగల కొన్ని గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం… -
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రికి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమవ్వడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ దారుణంగా స్తంభించిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.… -
Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
Cyberabad Police: హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని, ఐటీ కారిడార్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కీలకమైన ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేసింది. భారీ వర్షాల వల్ల రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ స్తంభించిపోకుండా నివారించడమే… -
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
Hyderabad: హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి వరద నీటి తాకిడి పెరుగుతోంది. ఉపరితలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి, నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. -
CM Revanth Reddy : హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అకస్మాత్తుగా మారిన వాతావరణం, కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వరద నీరు నిలిచే చోట్ల తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని రంగంలోకి దించాలని స్పష్టం… -
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
Story Board: వర్షాకాలం వస్తే చాలు.. హైదరాబాద్ ఆగమాగం అవుతోంది. అందుకే వాన పడుతోంటే చాలు.. నగరవాసులు భయపడిపోయే దుస్థితి దాపురించింది. నగరంలో వర్షాన్ని మించిన విలన్ లేదనే స్థాయిలో వాన కష్టాలు ఉంటున్నాయి. అసలు వర్షాకాలం సమీపిస్తుందంటేనే గుండెల్లో దడ మొదలవుతోంది. ఎక్కడ ఏ నాలా కాలనీని ముంచేస్తుందో, ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ మృత్యుకుహరమై మనుషులను మింగుతుందో, ఎక్కడ ఏ చెట్టు ఉన్నట్టుండి కూలిపోయి ఎవరి ప్రాణాలు తీస్తుందో.. ఏ రోడ్డు ఏ నదిలా మారిపోతుందో,… -
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
Hitech City Traffic :హైదరాబాద్ మహానగరాన్ని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం వణికించింది. కేవలం గంట సేపు పడిన వానకే నగరం మొత్తం అతలాకుతలమైంది. ముఖ్యంగా కోట్లు కురిపించే ఐటీ హబ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు నడిరోడ్డుపైనే గంటల తరబడి చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరువులను తలపించిన ఐటీ రోడ్లు నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, ఐక్యా… -
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
Chhatta Bazaar Arch Collapse : భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాతబస్తీలోని ఛత్తా బజార్లో ఉన్న ఒక చారిత్రక కమాన్ అకస్మాత్తుగా కూలిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు ఈ పురాతన కట్టడం పూర్తిగా నాని, బలహీనపడటంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కమాన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పెద్ద శబ్దం రావడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో… -
Tragedy: హైదరాబాద్‌లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
Tragedy: భాగ్యనగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. నగరవ్యాప్తంగా కుండపోతగా వాన పడటంతో పలు ప్రాంతాలు జలమయమవగా, పాతబస్తీలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం కురిసిన కుంభవృష్టికి చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షం దాటికి రోడ్డుపై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అయితే, నీరు నిలిచి…
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!