గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, కృష్ణానగర్, సనత్ నగర్, మియాపూర్, చందనాగర్, కేపీహెచ్‌బీ, సుచిత్ర, ఏఎస్‌రావు నగర్.. తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి రహదారులు అన్నీ జలమయమయ్యాయి. మోకాలి లోతు వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్ధృతంగా ప్రవహిహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బల్కంపేట్‌లోని…
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత కూడా గంటపాటు విడవకుండా కురిసింది.
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మామూలుగా ఉన్నప్పటికీ, సాయంత్రం వచ్చిన వర్షం నగర జీవనాన్ని దెబ్బతీసింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హయత్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో తీవ్ర ఆందోళన నెలకొంది. వరద నీటి ధాటికి ఒక ఇంటి పునాది కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభం భవనంపైకి వరిగిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దూకుడుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద పోటెత్తింది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అప్డేట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. ఎల్బినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హయత్ నగర్లో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది.