Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad Police: హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని, ఐటీ కారిడార్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కీలకమైన ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేసింది. భారీ వర్షాల వల్ల రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ స్తంభించిపోకుండా నివారించడమే కాకుండా, ఉద్యోగుల భద్రతను, అత్యవసర సేవల రాకపోకలను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత వరకు ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యాన్ని కల్పించాలని, కార్యాలయాలకు వచ్చిన వారిని మధ్యాహ్నం 2:00 గంటల నుంచి దఫదఫాలుగా (staggered manner) ముందస్తుగా లాగ్ అవుట్ (Early Logout) చేయాలని పోలీసులు సూచించారు.
ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఐటీ కారిడార్‌లోని ప్రధాన రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ముందస్తు ప్రణాళికతో దఫదఫాలుగా లీవ్ చేయడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ తగ్గి, రాకపోకలు సులభతరం అవుతాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఐటీ కంపెనీలు తమ ముందస్తు లాగ్ అవుట్ సమయాలు, ఆఫీసుల లోకేషన్ వివరాలను సరిగ్గా నిర్వహించడానికి `Jt.CP.traffic.cyberabad@gmail.com` కు ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని పోలీసులు కోరారు. దీనివల్ల ట్రాఫిక్ పోలీసులు రహదారులపై తగినంత సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా నిర్వహణ చేపట్టడానికి వీలవుతుందని సూచించారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు, ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
Revised order stating the Work from Home (WFH) and Early logouts in staggered manner on 30.07.2026 from 2pm onwards.. pic.twitter.com/TyBkw4g5Qh
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) July 30, 2026
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!