Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్ ఫెయిర్ మొన్న గురువారమే ఓపెన్ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది.
WE HUB: ‘వి హబ్’ అనేది టెక్నికల్‌గా ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ కావొచ్చు. కానీ ఈ సంస్థ అందిస్తున్న అసమాన సేవలను బట్టి దాన్ని ఉమెన్ ఎంపవర్‌మెంట్ హబ్ అని కూడా అనొచ్చు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ‘వి హబ్’ తన వంతుగా శాయశక్తులా పాటుపడుతోంది. వ్యాపారానికి ముఖ్యంగా డబ్బు కావాలి. కానీ అంతకన్నా ముందు అసలు బిజినెస్ చేయాలనే ఆలోచన, ప్రణాళిక ఉండాలి. అవి ఉంటే పెట్టుబడి దానంతట అదే వస్తుందని ‘వి…
Golbal Summit at Hyderabad: హైదరాబాద్ మహానగరం మరో ప్రపంచ సదస్సుకు వేదిక కాబోతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన 'ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (TIE) అనే సంస్థ ఈ ఏడాది గ్లోబల్ సమ్మిట్‌ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. డిసెంబర్ 12-14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు విశేషాలను "టై హైదరాబాద్ చార్టర్" మెంబర్లు ఎన్-బిజినెస్ టెక్ టాక్ టీమ్‌కి వివరించారు.
Hyderabad becomes Cool City: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇకపై కూల్ సిటీ కానుంది. ఈ భాగ్య నగరంలో ఉష్ణోగ్రతలను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించేందుకు బాగా ఉపయోగపడే సరికొత్త కాన్సెప్ట్ అయిన 'విండ్ గార్డెన్' త్వరలోనే అందుబాటులోకి రానుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు సాకారం కావటం
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట…
స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకుంటామని ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్ లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచళన వ్యాఖ్యలు చేసారు. షో లోపలే మునావర్ ఫరూకీ పై దాడి చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజాసింగ్ తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా.. నేను షోను అడ్డుకుని తీరుతా అంటూ మండిపడ్డారు. ధర్మం కన్నా.. నాకు పార్టీ…
Hyderabad Public School: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్‌ఆర్)కి 50 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో రేపు శనివారం (జూలై 30న) ఉదయం పదిన్నర గంటలకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు భారీగా నీరు చేరడంతో.. గేట్లు తెరిచి మూసీలోకి నీటిని…
సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్…