కీసరలోని సాయిధామం ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామనందప్రభు స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ సాయిధామం ఆశ్రమ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, అందుకు అడ్డుపడుతున్నందుకే స్వామీజీపై ఈ వేధింపులా అంటూ భక్తులు మండిపడుతున్నారు. అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆశ్రమ సభ్యులు, హిందూ సంఘాల నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామిజీని విడుదల చేయాలంటూ ఆందోళన…
హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్లో విషాదం నెలకొంది. ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. కడప జిల్లా బద్వేల్ కి చెందిన రాజ్ కుమార్ నగరంలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన వివిధ మానసిక వత్తిళ్ళతో బాధపడుతున్నారు. తాజాగా సెలెన్లో విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక పరంగా ఇబ్బందులు పడుతున్నందునే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు మరే కారణాలు ఏవైనా వున్నాయా అనే కోణంలో ఎస్సార్ నగర్…
ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ లు చేరుకున్నారు.…
శిల్పా చౌదరిని రెండవ రోజు విచారిస్తున్నారు పోలీసులు. శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు ముందు నోరు విప్పిన శిల్పా రాధికా రెడ్డి అనే రియల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతోంది రాధికా రెడ్డి. దీంతో రాధికా రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. రాధికా రెడ్డి కి ఆరు కోట్లు ఇచ్చింది శిల్పా చౌదరి. ఆరు శాతం వడ్డీకి శిల్పా దగ్గర…
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన…