Physical Harassment : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ఆపై హత్య యత్నం చేశారు తండ్రీకొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారు సదరు నిందితులు. అయితే.. సమాచారం మేరకు తండ్రి కొడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతునట్లు సమాచారం. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బిబి అనే మహిళ ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది.
Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే
అయితే ఈ నెల 9వ తేదీ అదే ప్రాంతానికి చెందిన శ్రీను, రాజు అనే ఇద్దరు తండ్రి కొడుకులు ఆమెకు ఫంక్షన్ హల్ లల్లో పని ఉందని మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆమెను చెంగుమల్ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఇద్దరు అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడ్డ ఫాతిమా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. గమనించిన స్థానికులు ఆమెను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెంగుమల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు శీను, రాజు తండ్రి కొడుకులను బండ్లగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై అత్యాచారం హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అని ఆయన వ్యాఖ్యానించారు.
Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..