Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇటీవల 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలు ధరలు తగిలించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, అధిక టికెట్ రేట్లు నగర ట్రాఫిక్‌ను మరింతగా పెంచుతాయని హెచ్చరించారు.
Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు యాజమాన్యం వెనక్కి తగ్గింది. తాజా నిర్ణయంగా, పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ప్రయాణికులు మాత్రం ఈ తగ్గింపుతో సంతృప్తి చెందడం లేదు. డిస్కౌంట్ ఎప్పుడైనా రద్దు అయ్యే అవకాశం ఉండటంతో, వారు డిస్కౌంట్ కంటే నేరుగా ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, మెట్రో యాజమాన్యం డిస్కౌంట్ వర్తించే కొత్త టికెట్ ఛార్జీలను విడుదల చేసింది. పెంపు తర్వాత కనిష్ట టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు 10 శాతం తగ్గింపుతో కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69కి తగ్గింది. ఈ తగ్గింపు మే 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ డిస్కౌంట్ పేపర్ టికెట్లు, క్యూఆర్ టోకెన్‌లు, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులకు వర్తించనుంది.
10 శాతం డిస్కౌంటు తర్వాత చార్జీ
0-2 కి.మీ వరకు రూ.11.00 (ఇదే కనిష్ఠం)
2-4 కి.మీ వరకు రూ.17.00
4-6 కి.మీ వరకు రూ.28.00
6-9 కి.మీ వరకు రూ.37.00
9-12 కి.మీ వరకు రూ.47.00
12-15 కి.మీ వరకు రూ.51.00
15-18 కి.మీ వరకు రూ.56.00
18-21 కి.మీ వరకు రూ.61.00
21-24 కి.మీ వరకు రూ.65.00
24 కి.మీ ఆపైన రూ.69.00 (ఇదే గరిష్ఠ ఛార్జీ. ఉదాహరణకు ఎల్బీనగర్ నుంచి చివరి స్టేషన్ మియాపూర్ వరకు మెట్రో టికెట్ ధర 69 రూపాయలు)