ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా మెట్రో స్టేషన్లు ఆత్మహత్యకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల వరుసగా మెట్రో స్టేషన్లలో ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మళ్లీ ఇవాళ మూసాపేట మెట్రో స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలో బ్యాడ్ న్యూస్ అందనుంది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటికే సెంట్రల్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు.
హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ కి ..మెట్రో అనేది పెట్టుబడి దారుల కోసం పెట్టినట్టు ఉందని ఆరోపించారు. బిల్డర్ lnt 90 శాతం.. 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 31 km భారం రాష్ట్ర ప్రభుత్వమే భారం మొస్తుందని అన్నారు.
ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది.
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది.