Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. యువత పార్టీలు, దావత్‌ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో,
హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డును సృష్టించింది. సోమవారం రోజు ఏకంగా 5.10 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి.
Metro facility: తమ ప్రాంతాలకు హైదరాబాద్ మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి, మేడ్చల్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కోరుతున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదిగూడ, మియాపూర్-పటాన్చెరు రూట్లలో మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లు వినియోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులపై కొంత భారం పడింది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత ఉంటుందని వెల్లడించిన మెట్రో అధికారులు.. రద్దీ సమయాల్లో రాయితీని ఎత్తివేస్తామని చెప్పారు.
మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. సోమవారం ఉదయం ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఎర్రమంజైల్ లో అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రోలో టికెటింగ్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండో రోజు కూడా విధులు బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మెట్రో రైల్వేలో టికెటింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్నటి నుంచి విధులకు దూరంగా ఉన్నారు.
హైదరాబాద్‌లో మెట్రో రైల్ పిల్లర్లపై ఇకపై పోస్టర్ పడితే చాలు… ఆ పోస్టర్ వేసిన వారికి రంగు పడుద్ది.. అదేంటి మెట్రో పిల్లర్‌పై పోస్టర్ వేస్తే రంగు పడడమేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై అనుమతి లేని పోస్టర్ల వేయడం చట్ట విరుద్ధమని… అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి… హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై రాజకీయ నాయకులు పోస్టర్లు వేస్తున్నారు.. ఇక ఇప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం.. సెంట్రల్ మెట్రో రూల్స్…