హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. శుక్రవారం హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం ఉన్న నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా.. మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం.. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు…
ఇటీవల మెట్రో రైలులో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మెట్రో రైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ప్రజలకు హైదరాబాద్ మెట్రో సంస్థ స్ట్రాంగ్ నోటీసు ఇచ్చింది.
అగ్నిపథ్ ఆందోళనలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చేశాయి.. రైళ్లను తగలబెట్టడం, రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించడంతో.. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు పరుగులు పెట్టారు.. అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. Read Also: Secunderabad: ఆందోళనలకు ముందుగానే ప్లాన్ చేశారా? మరోవైపు, సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైల్వే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.. ఇక, ఎంఎంటీఎస్ సర్వీసులనుకూడా నిలిపివేస్తున్నట్టు…
హైదరాబాద్‌లో మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయాయి… మెట్రో రైలు ఎక్కితే చాలు.. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు… కోవిడ్ కంటే ముందు భారీ స్థాయిలో ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించిన.. కోవిడ్ మెట్రో ప్రయాణాన్ని దెబ్బకొట్టింది.. అయితే, మళ్లీ క్రమంగా మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నారు.. అయితే, ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం గంటకు 70 కిలో మీటర్ల వేగంతో మెట్రో రైళ్లు నడుస్తుండగా..…
హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రోరైలు అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్డుతో రోజంతా మెట్రోరైలులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ కార్డు ధర రూ.59గా మెట్రో అధికారులు వెల్లడించారు. ఉగాది రోజు నుంచి సూపర్ సేవర్ కార్డులను విక్రయిస్తామని మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ కార్డుతో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగవచ్చన్నారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలను ప్రయాణికులకు…
హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైళ్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్‌లో సుమారు 20 నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తరచూ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా మెట్రో రైలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో ఇటీవల…
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు సూపర్ ప్లాన్‌తో సిద్ధం అయింది. దీన్లో భాగంగానే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆయన అన్నారు. క్రమ క్రమంగా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 2.30 లక్షల ప్రయాణికలు మెట్రో సేవలను ఉపయో గించుకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య…
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సమయాల్లో త్వరలో మార్పు చేసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10:15 గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయం 7 గంటల కన్నా ముందే మెట్రో స్టేషన్‌లకు చేరుకుని వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దయచేసి మెట్రో…
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్ పాస్ ఆఫర్… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్ మెట్రోల్ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం…
తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా.. మరో 12 గంటల పాటు.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్‌డౌన్ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా…